Share News

మామిడి, టెంకాయ చెట్ల నరికివేత

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:50 AM

రెండున్నరేళ్ల పాటు కష్టపడి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్లను నరికేయడంతో రూ.10లక్షల నష్టం వాట్టిల్లిందని రైతు ఆవేదన చెందాడు. ఈ ఘటన గురువారం జరిగింది. మండలంలోని బొందిమడుగులకు చెందిన రైతు నవీన్‌కుమార్‌ రెడ్డి తన పొలంలోని 260 మామిడి చెట్లు, 120 టెంకాయ చెట్లును నరికేశారని తుగ్గులి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మామిడి, టెంకాయ చెట్ల నరికివేత
నరికివేసిన టెంకాయ చెట్లు, నరికివేసిన మామిడి మొక్కలు

రైతుకు రూ.10 లక్షలు నష్టం

తుగ్గలి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్ల పాటు కష్టపడి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్లను నరికేయడంతో రూ.10లక్షల నష్టం వాట్టిల్లిందని రైతు ఆవేదన చెందాడు. ఈ ఘటన గురువారం జరిగింది. మండలంలోని బొందిమడుగులకు చెందిన రైతు నవీన్‌కుమార్‌ రెడ్డి తన పొలంలోని 260 మామిడి చెట్లు, 120 టెంకాయ చెట్లును నరికేశారని తుగ్గులి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా రైతు నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్రిప్‌ పైపులు, వాల్స్‌ కూడా ధ్వంసం చేశారని అన్నారు. 2018లో రైతు బొందిమడుగుల రెవిన్యూలో సర్వే నెంబరు 247లో 4.13 ఎకరాలు కొన్నాడు. ఈ పొలంతోపాటు తన తల్లి ప్రభావతమ్మ పేర ఉన్న ఎకరా పొలంలో ఉన్న కొండలు గుట్టలు దాదాపు నాలుగేళ్లపాటు చదును చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన మామిడి, టెంకాయ చెట్లను సాగు చేశాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు మొక్కలు పెంచడం కోసం ఆహర్నిశలు కష్టపడి అప్పు చేసి సాగుచేశాడు. గురువారం ఉదయం పొలానికెళ్లే సరికి నరికేసిన చెట్లు కనిపించాయి. తనకు గతంలో ఈ పొలం అమ్మిన శ్రీరాములు అనే వ్యక్తే ఈ పని చేశాడని పేర్కొంటూ తుగ్గలి పోలీసుస్టేషన్లో నవీన్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్పై నరేష్‌ తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 12:50 AM