భయ'బడి'
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:09 AM
మండలంలోని బ్రాహ్మణపల్లె ప్రాథమిక పాఠశాల తరగతిగది పైకప్పు దెబ్బతిన ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ గదిలోనే ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చొబెట్టి బోధించాల్సి వస్తోంది.
పెచ్చులూడిన గదిలోనే బోధన, ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు
బ్రాహ్మణపల్లె ఎంపీపీ పాఠశాల దుస్థితి
చాగలమర్రి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మణపల్లె ప్రాథమిక పాఠశాల తరగతిగది పైకప్పు దెబ్బతిన ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ గదిలోనే ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చొబెట్టి బోధించాల్సి వస్తోంది. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 14 మంది విద్యార్థులు చదువుతున్నారు. గదిని చూసి, ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గది గోడలు దెబ్బతిని బీటలు వారాయి. వర్షం వస్తే కూర్చొవడానికి కూడా వీలుదు. అలాగే తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్ దెబ్బతినడంతో విద్యార్థులు ఆరయబటకు వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో నాడు-నేడు కింద కూడా పాఠశాలను ఎంపికచేయలేదు. ఐదేళ్ల నుంచి దెబ్బతిన్న దెబ్బతిన్న భవనంలోనే భయంతోనే బోధిస్తున్నామని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. భవనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.