Share News

భయం.. భయం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:14 AM

: పట్టణంలోని పాతబస్టాండు, పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు, ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్మకు రక్షణ కంచెలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాదచారులు, వాహనదారులు బయపడుతున్నారు.

భయం.. భయం
డోన్‌ పట్టణంలోని ఫ్లై ఓవర్‌ వద్ద ఇలా..

డోన్‌ పట్టణంలో రక్షణ కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు

డోన్‌ టౌన్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాతబస్టాండు, పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు, ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్మకు రక్షణ కంచెలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాదచారులు, వాహనదారులు బయపడుతున్నారు. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, పాతబస్టాండు వద్ద ప్రజలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మరలకు కంచెలేదు. అలాగే మార్కెట్‌ సమీపంలో ఇళ్ల మద్య ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా విద్యుత్‌ అధికారులు కంచె వేయకపోవడంతో కాలనీవాసులు బిక్కుబిక్కు మంటూ కాపురాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పలుమార్లు విద్యుత్‌ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

ఫ ఈ విషయమై ఏఈ మురళికృష్ణను వివరణ కోరగా పట్టణంలో కంచె లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి రక్షణ గోడ నిర్మించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లను ఖాళీ స్థలాల్లోకి తరలిస్తామని తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 12:14 AM