Share News

తండ్రి, కొడుకు రక్తదానం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:19 AM

కర్నూలు మెడికల్‌ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో లెక్చరర్‌ ఇన్‌ సోషల్‌ సైన్సె్‌సగా పని చేస్తున్న బి. సురేష్‌ కుమార్‌ తన 54వ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం కర్నూలు రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

తండ్రి, కొడుకు రక్తదానం
రక్తదానం చేస్తున్న తండ్రి, కుమారుడు

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్‌ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో లెక్చరర్‌ ఇన్‌ సోషల్‌ సైన్సె్‌సగా పని చేస్తున్న బి. సురేష్‌ కుమార్‌ తన 54వ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం కర్నూలు రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి సురేష్‌ కుమార్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన కుమారుడు డిగ్రీ విద్యార్థి జయంత్‌ కూడా రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లెక్చరర్‌ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పిల్లల పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయాలన్నారు. రక్తదానం వల్ల ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డా. కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లి రోజు రక్తదానం చేసే మంచి కార్యక్రమానికి నాందీ పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు జి. శ్రీనివాసులు పాల్గొన్నారు

Updated Date - Jun 03 , 2026 | 12:19 AM