Share News

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:19 AM

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

సోమయాజులపల్లెలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆమె పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో అందిస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలతో రైతుల భూములకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. గత వైసీపీ హయాంలో వైఎస్‌ జగన ఫొటోతో ఉన్న పాసు పుస్తకాల్లోనే తప్పిదాలను సరిదిద్దుతున్నామన్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన చేయగానే భూమి వివరాలు తెలుస్తాయన్నారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పై ఉందన్నారు. గ్రామంలో వాటర్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుందని, నూతనంగా ట్యాంకు నిర్మిస్తామన్నారు. పొలాలకు వెళ్లే వాగులో వంతెన నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో నాగ అనసూయ, ఏవో మధుమతి, సొసైటీ అధ్యక్షులు సుధాకర్‌ రెడ్డి, సుధాకర్‌రావు, టీడీపీ జిల్లా ఉపాద్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు రాంభూపాల్‌ రెడ్డి, ట్రెజరర్‌ మహబూబ్‌ బాషా, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామమద్దిలేటి, నాయకులు ఆకుల మహేష్‌, నాగమల్లేష్‌, బ్రహ్మయ్య ఆచారి, భాస్కర్‌ రెడ్డి, రామకృష్ణయ్య, ప్రతాప్‌, కిరణ్‌ కుమార్‌, సంజీవ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, వీఆర్వో బాలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:19 AM