Share News

రైతులు ఆందోళన చెందొద్దు

ABN , Publish Date - May 29 , 2026 | 11:53 PM

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు
పురుగుమందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న జేడీఏ వరలక్ష్మి

యూరియా కొరత లేదు

వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి

ఓర్వకల్లు, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం ఓర్వకల్లులో పురుగు మందుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించామన్నారు. పాత నిల్వలు ఉన్న ఎరువు లను పాత ధరలకే విక్రయించాలన్నారు. నేల, ఆరోగ్య కార్డులోని సిఫారసు ప్రకారం ఎరువులను అమ్మాలని, రైతులు ఎరువులు కొనుగోలు కోసం ఏపీఏఐఎం ఎస్‌-2.0 యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల న్నారు. వర్షపాతం 60 నుంచి 70 మీ.మీల వర్షపాతం అందినప్పుడు మాత్రమే పంటలు వేయా లని సూచించారు. ఇనచార్జి ఏడీఏ దస్తగిరిరెడ్డి, ఏవో మధుమతి ఉన్నారు.

లాటరీ పద్ధతిలో పరికరాలు అందిస్తాం

కర్నూలు అగ్రికల్చర్‌: వచ్చే ఖరీఫ్‌లో రైతులకు పంటల సాగు కోసం వ్యవసాయ పరికరాలను అందించేందుకు లాటరీ పద్ధతిని అమలు చేస్తు న్నామని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె విలేక రులతో మాట్లాడారు. వ్యవసాయ పరికరాల కోసం రైతులను దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిందన్నారు. జనరల్‌ కేటగిరి కింద 6,741 దరఖా స్తులు, ఎస్సీల నుంచి 703, ఎస్టీ రైతుల నుంచి 39 దరఖాస్తులు మొత్తం 7,483 మంది దరఖాస్తు అందాయన్నారు. శనివారం నుంచి జూన 3వ తేదీ వరకు లాటరీ ప్రక్రియలో రైతులను ఎంపిక చేస్తామని లబ్దిదారుల జాబితాను ఇనచార్జి మంత్రి ఆమోదంతో ప్రకటిస్తామన్నారు. జూన 4 నుం చి 7 వరకు వ్యవసాయ పరికరాల డెలివరీ, జూలై 5 నుంచి సబ్సిడీ మొ త్తాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తుందన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:53 PM