Share News

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రైతుల అభివృద్ధి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:03 PM

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రైతులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రైతుల అభివృద్ధి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌ టౌన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రైతులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గ్లోబల్‌ హార్టికల్చర్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని డోన్‌ మండలంలోని యు. కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల అధికారులు, రైతులు, ప్రజలతో కలిసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలో ఉద్యానరంగాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కీలకమైన అడుగు అన్నారు. ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతికత, పరిశోధన, శిక్షణ, ప్రాసెసింగ్‌, నిల్వ, మార్కెటింగ్‌, ఎగుమతులకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా రైతులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ద్వారా వ్యవసాయ, ఉద్యానరంగంలో ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలను ప్రోత్సహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, బీజేపీ నాయకులు సంధు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:03 PM