Share News

ఆయిల్‌పామ్‌తో రైతులు అభివృద్ధి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:11 AM

రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుతోనే ఆర్థికావృదిఽ్ధ సాధించవచ్చునని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి అన్నారు.

ఆయిల్‌పామ్‌తో రైతులు అభివృద్ధి
మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి

గోనెగండ్ల, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుతోనే ఆర్థికావృదిఽ్ధ సాధించవచ్చునని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం గోనెగండ్ల మండలంలోని కులుమాల గ్రామంలో జిల్లా ఉద్యాన వన శాఖ, పతాంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతుకు ఒక ఎకరాకు 50 మొక్కల చొప్పల ఏడాది వయస్సు ఉన్న మొక్కలను ఉచితంగా ఉద్యాన వనశాఖ వారు అందజేస్తారని తెలిపారు. ఒక హెక్టార్‌కు రూ. 10,500 ఆయిల్‌ పామ్‌ పంట ఖర్చులకు, అంతర్‌ పంట సాగుకు ప్రోత్సాహకంగా ఇస్తారని తోలిపారు. ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేసుకుంటే 4వ సంవత్సరం నుంచి దాదాపు 25 ఏళ్లు పాటు 12 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుందని అన్నారు. రూ. 1,50,000 నుంచి రూ. 2,70,000 వరకు ఎకరానికి ఆదాయం వస్తుందని వివరించారు. ఏడీఏ మహుమ్మద్‌ ఖాద్రీ, ఏవో హేమలత, ఎమ్మిగనూరు ఉద్యానవన శాఖ అధికారి శ్రీవాణి, పతాంజలి మేనేజర్‌ రమణారెడ్డి, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:11 AM