Share News

హార్వెస్టర్‌తో రైతుకు ఊరట

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:03 AM

మండలంలో 16వేల ఎకరాలలో రైతులు జెజి11(ఎర్రవి), పులిగి(తెల్లవి) శనగను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, పచ్చపురుగు బెడద లేకపోవడంతో ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

హార్వెస్టర్‌తో రైతుకు ఊరట
శనగ పంట కోత కోస్తున్న హార్వెస్టర్‌

కూలీల ఖర్చు కంటే తక్కువ ధర..

సంజామల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో 16వేల ఎకరాలలో రైతులు జెజి11(ఎర్రవి), పులిగి(తెల్లవి) శనగను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, పచ్చపురుగు బెడద లేకపోవడంతో ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

కూలీల కొరత..

ఈ రబీలో సాగుచేసిన శనగ కోతకు వచ్చింది. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. ఎకరా కోతకు 6 నుంచి 8 మంది కూలీలు అవసరం కాగా, ఒక్కో కూలీకి ఉదయం 11గంటలకే రూ 400 చెల్లించాలి. ఈ లెక్కన ఎకరాకు రూ.3,200 అవుతోంది.

రైతును ఆదుకుంటున్న హార్వెస్టర్‌ యంత్రాలు..

శనగ కోతకు హార్వెసర్టర్‌ యజమానికి ఎకరానికి రూ.1,400 నుంచి రూ.1,600 చెల్లించాలి. దీంతో రైతులకు రూ.2వేలకుపై మిగులుతోంది. హార్వేస్టర్లు రోజుకు 20 ఎకరాలకు పైగానే కోత కోస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హార్వేస్టర్లతో కోత సులువు..

శనగ కోతకు కూలీల కొరతతో ఇబ్బంది పడ్డాం. అయితే హార్వెస్టర్లతో కోత కోయించడం సులువు. ఖర్చు కూడా తగ్గింది.

- రమణ, శనగ రైతు, సంజామల.

Updated Date - Feb 09 , 2026 | 12:03 AM