Share News

నిర్లక్ష్యానికి రైతు బలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:35 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాన్ని తీసింది. న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో ఉన్న సిటీ స్కాన్‌ పరీక్ష కోసం రెండు రోజులుగా తిరుగుతూ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో చాకలి శంకర్‌(56) అనే రైతు చివరికి గుండెపోటుతో చనిపోయాడు.

నిర్లక్ష్యానికి రైతు బలి
మృతిచెందిన రైతు శంకర్‌

సిటీ స్కాన్‌ పరీక్ష కోసం వెళ్తూ రోగి మృతి

న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌ ఎదుట కుప్పకూలిన రైతు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాన్ని తీసింది. న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో ఉన్న సిటీ స్కాన్‌ పరీక్ష కోసం రెండు రోజులుగా తిరుగుతూ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో చాకలి శంకర్‌(56) అనే రైతు చివరికి గుండెపోటుతో చనిపోయాడు. గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు చెందిన చాకలి శంకర్‌ కాలికి గాయమై చీము కారుతుండటంతో కర్నూలు జీజీహెచ్‌కు చికిత్స కోసం వచ్చారు. రోగి దగ్గర ఎక్స్‌రే ఫిల్మ్‌ కూడా ఉంది. వైద్యులు, సిటీ స్కాన్‌ చేయించుకోవాలని చెప్పడంతో మంగళవారం ఉదయం ఆసుపత్రిలో కాలినడకనే రెండు రోజులుగా తిరిగినట్లు, స్టెచ్చర్‌ కూడా లేదని మృతుని భార్య రంగమ్మ తెలిపారు. సిటీ స్కాన్‌ కోసం తిరుగుతూనే ఒక్కసారిగా రైతు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత రోగిని అక్కడ ఉన్న ఓ వైద్యుడు, సెక్యూరిటీ గార్డ్‌ సహాయంతో క్యాజువాల్టీకి తరలించగా.. అప్పటికే రోగి చనిపోయాడు. ఇదే సమయంలో ఎఫ్‌ఎ్‌సబీ సర్జరీ వార్డులో కోవెలకుంట్లకు చెందిన యాస్మిన్‌ (36) సెల్యూరైటీ్‌సతో బాధపడుతోంది. వైద్యులు ఎక్స్‌రే పరీక్ష రాసి ఇవ్వడంతో న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌కు వెళ్తూ గుండెపోటుకు గురైంది. క్యాజువాల్టీకి తరలించి సీపీఆర్‌ చేశారు. రోగి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేవలం అరగంట వ్యవధిలో ఇద్దరు రోగులు గుండెపోటుతో మృతి చెందడం హాస్పిటల్‌లో కలకలం రేపింది.

సిటీ స్కాన్‌ పరీక్షలు మరింత ఆలస్యం

న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో ఆసుపత్రికి చెందిన రెండు సిటీ స్కాన్‌ యంత్రాలుఉన్నాయి. ఒకటి ప్రభుత్వం ఇవ్వగా.. మరొకటి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ వారు ఇచ్చారు. రెండు సిటీ స్కాన్‌ మిషన్‌లకు నలుగురు టెక్నీషియన్‌లు మాత్రమే ఉన్నారు. దీంతో పరీక్షలు ఆలస్యమవతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. మంగళవారం మృతి చెందిన పెద్ద నేలటూరు చెందిన రైతు సిటీ స్కాన్‌ పరీక్షలు ఆలస్యం కావడం వల్లే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.

Updated Date - Sep 08 , 2026 | 11:35 PM