రైతుకు వరం.. నీటి కుంట
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:18 AM
ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు నీటి కుంటలు(ఫారం పాండ్) ఏర్పాటు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. కుంటలను తవ్వుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.
వర్షపు నీటితో పంటకు మేలు
సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
డోన్ రూరల్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు నీటి కుంటలు(ఫారం పాండ్) ఏర్పాటు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. కుంటలను తవ్వుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మండలంలో ఇప్పటికే 30 మందికి పైగా రైతులు కుంటలు ఏర్పాటు చేసుకుని, ఉద్యాన పంటలను సంరక్షించుకుంటున్నారనీ ఉద్యానశాఖ అధికారి జి.కళ్యాణి తెలిపారు. ఎద్దుపెంట, తిరునాంపల్లి గ్రామాల్లో ఫారంపాండ్స్ పథకం కింద 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతో కుంటల ఏర్పాటుకు యూనిట్‌కు రూ.1.80లక్షలు కాగా, ప్రభుత్వం రూ.90వేలు సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు కూడా కుంటలను తవ్వుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
నీటి కుంటలతో ప్రయోజనాలు..
నీటి కుంటల ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకుని ఆ నీటిని ఎండాకాలంలో ఉపయోగించుకోవచ్చని, ఎల్‌నినో ప్రభావంతో వచ్చే నీటి కొరతను తగ్గించుకోవచ్చన్నారు. మామిడి, అరటి, జామా బత్తాయి, కొబ్బరి తోట పంటలను సంరక్షించుకోవచ్చన్నారు. పంటలు ఎండిపోకుండా నీటి కుంటలు కాపాడతాయని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.
కుంటతో ప్రయోజనం
నాకు ఆరు ఎకరాల్లో మామిడి తోట ఉంది. సబ్సిడీ కింద నీటికుంట తవ్వున్నాను. ఆ నీటితోనే మామిడి తోటను సంరక్షించుకుంటున్నాము. - పద్మావతమ్మ, మహిళా రైతు, తిరునాంపల్లి
వినియోగించుకోవాలి
ఫారంపండ్ పథకాన్ని ఉధ్యాన రైతులు వినియోగించుకోవాలిన. నీటి కుంటలు తవ్వుకుంటే వర్షపునీరు నిలిచి పంటలకు ఉపయోగపడుతుంది. ఆసక్తిగల రైతులు సమీప రైతుసేవా కేంద్రాల్లో, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. - జి. కళ్యాణి, ఉద్యాన శాఖ అధికారి, డోన్