Share News

‘వైసీపీవి అసత్య ప్రచారాలు’

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:21 AM

): వైసీపీ నాయకులు ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు.

‘వైసీపీవి అసత్య ప్రచారాలు’
పార్టీలో చేరిన డబ్ల్యూ.గోవిందిన్నె వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దొర్నిపాడు మండలం డబ్య్లూ.గోవిందిన్నె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ చేరారు. శివప్రసాద్‌, శంకరయ్య, శివరామయ్య, సాంబరావు, కృష్ణారెడ్డి, శంకరయ్య, శివరాముడు, సాంబశివుడు, పెద్ద జనార్దన్‌, ఓవ్వకంటి శివయ్య, తోపాటు 20 కుటుంబాల వారికి ఎమ్మెల్యే, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారికి గుర్తింపు ఇస్తామని, కలిసి కట్టుగా పని చేయ్యాలని కోరారు.

చాగలమర్రి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం చిన్నబోదనం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు యామా ఓబుళరెడ్డితోపాటు మరో 15 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు. రమణారెడ్డి, శజ్నారెడ్డి పాల్గొన్నారు.

శిరివెళ్లకు చెందిన విశ్రాంత ఎంఈవో పాతూరి మహబూబ్‌బాషా, ముల్లా కుద్దూస్‌ కుమారులు మన్నన్‌ ఆయూబ్‌బాషా ఎమ్మెల్యే సమక్ష్యంలో టీడీపీలో చేరారు.

Updated Date - Nov 17 , 2026 | 12:21 AM