Share News

ఉపాధి పనులు కల్పించడంలో విఫలం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:05 AM

గ్రామాల్లోని పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు విఫలయ్యారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ విమర్శించారు.

ఉపాధి పనులు కల్పించడంలో విఫలం
మాట్లాడుతున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ

కర్నూలు న్యూసిటీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు విఫలయ్యారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ విమర్శించారు. మంగళవారం స్థానిక కేకే భవనలో కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు మండల బాధ్యుల సమావేశం బి.నాగన్న అధ్యక్షతన జరి గింది. నారాయణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ పనులు తగ్గి పోయి వేలాది మంది పేదలు సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నా రన్నారు. ఈ క్రమంలో ఆస్పరి మం డలం పుటకలమర్రి గ్రా మంలో పనుల కోసం వెళుతూ కూలీల ఆటో బోల్తా పడి 43 మంది గాయాల పాలైన్నారన్నారు. సమావేశంలో కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు మండల కార్యదర్శులు గోపాల్‌, శ్రీనివాసులు, శేషయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:05 AM