Share News

భక్తులకు వసతులు కల్పించాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:37 PM

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వడానికి కొద్దిరోజులే ఉన్నందున భక్తులకు అన్ని వసతులు కల్పించాలని, పర్యవే క్షణలో లోపం ఉండకూడదని దేవస్థానం అధికారులు, సిబ్బం దికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నా యుడు, ఈవో శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. శనివారం హఠకేశ్వరం వద్ద ఏర్పాటు చేస్తున్న 3.90 లక్షల లీటర్ల సామ ర్థ్యం గల స్లంపును నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తే దారులకు చైౖర్మెన్‌ పలు సూచనలు చేశారు.

భక్తులకు వసతులు కల్పించాలి
అటవీ మార్గాన్ని చూస్తున్న ఈవో

అటవీ మార్గంలో అత్యవసర వైద్యానికి ప్రాధాన్యత

చైౖర్మన్‌, ఈవో

శ్రీశైలం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వడానికి కొద్దిరోజులే ఉన్నందున భక్తులకు అన్ని వసతులు కల్పించాలని, పర్యవే క్షణలో లోపం ఉండకూడదని దేవస్థానం అధికారులు, సిబ్బం దికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నా యుడు, ఈవో శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. శనివారం హఠకేశ్వరం వద్ద ఏర్పాటు చేస్తున్న 3.90 లక్షల లీటర్ల సామ ర్థ్యం గల స్లంపును నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తే దారులకు చైౖర్మెన్‌ పలు సూచనలు చేశారు. కైలాసద్వారం 20వేల లీటర్ల శాశ్వత మంచినీటి ట్యాంకుతోపాటు 5వేల లీటర్ల సామర్థ్యం గల 8 ట్యాంకులు, భీమునికొలను వరకు 1000 లీటర్ల సామర్థ్యంగల ట్యాంకులను ఆరుచోట్ల ఏర్పాటు చేసి వాటికి నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని అన్నారు. చలువపందిళ్లలో విద్యుద్దీకరణ, మంచినీరు, అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచెయ్యాలని ఈవో అన్నారు. కైలాసద్వారం వద్ద తాత్కాలికంగా విద్యుత్‌ జనరేటర్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. భీముని కొలను మెట్ల మార్గం లో ఎప్పటికప్పుడు శుభ్రపరచేందుకు తగినంతమంది కార్మికు లను నియమించుకోవాలని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమన్వయంతో అటవీ మార్గం నుండి వచ్చే భక్తు లకు నిరంతరం మంచినీటి వసతి, అత్యవసర వైద్య సదుపా యాలను కల్పించాలని అన్నారు. చైౖర్మెన్‌, ఈవో వెంట ఈఈ నర్సింహారెడ్డి, ఏఈవో మల్లికార్జునరెడ్డి, డీఈలు చంద్రశేఖర శాస్త్రి, సుబ్బారెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:37 PM