Share News

రైతుకు అదనపు భారం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:07 AM

మండలంలోని పేరూరు, ఎర్రగుడిదిన్నె, చిలకలూరు, పెద్దకంలూరు,. కోటకొండ సహా ఇతర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. అయితే సాగునీరు ఉన్నా అది కాలువలకు రావడం లేదు. దీంతో అందకపోవడంతో పంటలను దక్కించుకోవడానికి డీజిల్‌ ఇంజన్లను వాడాల్సి వస్తోందని, అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుకు అదనపు భారం
చందలూరులో ఆయిల్‌ ఇంజన్‌తో మొక్కజొన్నకు సాగునీరు మందలూరులో ట్రాక్టరుతో నీరు

తెలుగు గంగ నుంచి కాలువలకు అందని నీరు

ఆయిల్‌ ఇంజన్‌, ట్రాక్టర్లతో నీరందిస్తున్న రైతులు

ఎకరాకు రూ.వేలల్లో ఖర్చు

రుద్రవరం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పేరూరు, ఎర్రగుడిదిన్నె, చిలకలూరు, పెద్దకంలూరు,. కోటకొండ సహా ఇతర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. అయితే సాగునీరు ఉన్నా అది కాలువలకు రావడం లేదు. దీంతో అందకపోవడంతో పంటలను దక్కించుకోవడానికి డీజిల్‌ ఇంజన్లను వాడాల్సి వస్తోందని, అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు రూ.2వేల అదనపు భారం

మొక్కజొన్న, మినుము పంటలకు నీరు పారించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆయిల్‌ ఇంజన్‌ బాడుగ రోజుకు రూ.వెయ్యి కాగా డీజిల్‌ ఖర్చు మరో వెయ్యి మొత్తం ఎకరాకు రూ.2వేలు ఖర్చవుతోందంటున్నారు. మరికొందరు ట్రాక్టరుతో నీటిని పారిస్తున్నారు. రోజుకు 3 ఎకరాలు నీటిని పారించవచ్చని, రోజుకు 35 నుంచి 40 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతోందని, దీంతో పెట్టుబడితో పాటు సాగునీటి తడుల ఖర్చు పెరుగుతోందని, దీన్ని భరించలేకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలుగు గంగ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా పిల్ల కాలువలను సరిచేయాలని కోరుతున్నారు.

ఖర్చు పెరుగుతోంది

డీజల్‌ ఆయిలింజన్ల బాడుగ భారంగా మారింది. మొక్కజొన్న పంటకు ఎకరాకు సాగునీరు పారించేందుకు రూ.2వేలు అదనపు ఖర్చు వచ్చింది. పంటలను రక్షించుకోవడానికి తప్పడం లేదు. - నారాయణ, రైతు, నక్కలదిన్నె

అదనపు భారం

సాగునీరు చెంతనే ఉన్నా పంట పొలాలకు నీరు రావడం లేదు. దీంతో కాల్వ నుంచి నీటిని ఆయిలింజన్‌తో తోడి పంటకు పారిస్తున్నాం. ఈ నీటి తడుల ఖర్చు అదనపు భారంగా మారింది. - బాలనరసింహులు, పెద్దకంబలూరు

Updated Date - Mar 04 , 2026 | 12:07 AM