Share News

సంయమనం పాటించండి

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:35 PM

బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవార్ల దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న శివస్వాములు సంయమనం పాటించాలని ఈవో ఎం శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు భక్తులకు వినతి చేశారు.

సంయమనం పాటించండి
శివస్వాములతో మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరావు

శివస్వాములకు ఈవో, చైర్మెన్‌ విజ్ఞప్తి

సుమారు లక్ష మంది భక్తులు క్షేత్రంలో ఉన్నట్లు అంచనా

శ్రీశైలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవార్ల దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న శివస్వాములు సంయమనం పాటించాలని ఈవో ఎం శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు భక్తులకు వినతి చేశారు. సోమవారం ఉదయం నుంచి ఆలయ పరిసరాలలో అలజడి సృష్టిస్తూ తోటి శివస్వాములకు, సామాన్య భక్తులకు ఇబ్బందులు గురిచేయడం సమంజసం కాదని వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సాయం త్రం కమాండ్‌ కంట్రోల్‌ రూంలో విలేకరులతో మాట్లాడుతూ తమపై కుట్రపూరితంగా కొందరు శివ స్వా ములు గొడవలు సృష్టించి ఆలయ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని ఈవో అన్నారు. భక్తులకు కల్పించిన వసతుల ను వినియోగించు కోకుండా ధ్వంసం చేయడం బాధా కరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ ఆదేశాలతో శ్రీశైలం దేవస్థానంలో శాంతి భద్రతల పరిరక్షణకు 500 మంది పోలీసులు నంద్యాల నుంచి బయల్దేరారు.

Updated Date - Feb 09 , 2026 | 11:35 PM