టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: డీటీఎఫ్
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:38 PM
ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తి మినహాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎ్‌ఫ) రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తి మినహాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎ్‌ఫ) రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గట్టు తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బీమన్న మాట్లాడుతూ టెట్ మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరి మితం చేయాలని, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుకు మాత్రమే టెట్ సిలబ్‌సను పరిమితం చేయాలని, పరీక్షను ఆప్‌లైన్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రోశన్న, రాష్ట్ర బాధ్యులు రత్నం ఏసేపు, జిల్లా కార్యదర్శి మద్దయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు స్వామి శేఖర్, గోపాల్, సుబ్బరాయుడు, రవికుమార్, సుధాకర్, హుశేన్, శ్రీనివాసప్రసాద్ పాల్గొన్నారు.