Share News

ఉత్కంఠ..!

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:25 PM

విజయ డెయిరీ ఎన్నికల పక్రియకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం మూడు డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరణతో పాటు పరిశీలన కూడా జరగనుంది.

ఉత్కంఠ..!

నేడు విజయ డెయిరీ డైరెక్టర్‌ ఎన్నికలకు నామినేషన్‌

నంద్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ ఎన్నికల పక్రియకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం మూడు డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరణతో పాటు పరిశీలన కూడా జరగనుంది. విజయ డెయిరీలోని మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరిపాలన భవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్‌ దాఖలు.. ఆ తర్వాత 3 గంటలకు పరిశీలన పక్రియ జరుగుతుంది. ఇప్పటికే సదరు డెయిరీ ఆవరణలో పోలీసు బలగాలు మొహరించాయి. అయితే నామినేషన్‌తో పాటు పరిశీలిన పక్రియ కూడా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదివరకే విజయ డెయిరీ వ్యవహారంపై అటు భూమా వర్గంతో ఇటు ప్రస్తుత చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి వర్గాల మధ్య అధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల పక్రియపై కూడా కూటమి అధిష్ఠానం దృష్టికి భూమా వర్గం తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల నామినేషన్‌ పక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సజావుగా ఎన్నికల పక్రియ సాగుతుందా..? లేక ఇతర కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడుతుందా..? అన్న సందేహాలు నెలకొన్నాయి. డెయిరీ జాబితా విడుదల చేసిన 46వ ుందిలో మూడు డైరెక్టర్ల పదవులకు పోటీ పెరిగింది. ప్ర స్తుత చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్గం సైతం డైరెక్టర్ల పదవులకు నా మినేషన్‌ వేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. ప్యూహాత్మకంగా నామినేషన్‌ పక్రియ జరిపేందుకు చర్యలు కూడా తీసుకున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:25 PM