ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:54 PM
: స్థానిక ఎన్నికల నేపఽఽథ్యంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిఘా ముమ్మరం చేసింది
500 లీటర్ల ఊట ధ్వంసం, 15 లీటర్ల సారా పట్టివేత
ఎన్నికల వేళ మద్యం తయారీ,
విక్రయాలపై నిఘా..
కర్నూలు అర్బన్ ,అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నేపఽఽథ్యంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిఘా ముమ్మరం చేసింది. గురువారం నగరంలోని బంగారుపేటలో అసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావు, సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు పర్యవేక్షణలో ఈ దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 500 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల నాటు సారా, 10 కిలోల బెల్లం, 5 కిలోల నవసాగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నాటు సారా తయారు చేయడం, విక్రయించడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలించడం చట్టరీత్యా నేరమని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఏఈఎ్‌సలు రాజశేఖరగౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, సుభాషిణి, కిషోర్, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సారా నిర్మూలనకు కార్డన్ సెర్చ్
బనగానపల్లె: మండలంలో సారా నిర్మూలనకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ సతీశ్ తెలిపారు. గురువారం నంద్యాల అసిస్టెంట్ సూపరిండెంటెంట్ విజయకుమార్ ఆధ్వర్యంలో చిన్నరాజుపాలెంతండా, పసుపుల తండా, పట్టణంలో అనుమానితుల ఇళ్లలో దాడులు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాడులు చేశామన్నారు. అక్రమ మద్యం, సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సారా తయారీదారులు కిరాణాదుకాణాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీవనోపాఽధి పొందుతున్నారన్నారు. ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి, కోవెలకుంట్ల సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ ఎస్‌ఐ సరస్వతి, నంద్యాల ఎస్‌ఐ రమేశ్‌బాబు, తదితరసిబ్బంది పాల్గొన్నారు.