ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:02 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమావేశ భవనంలో ప్రజల నుంచి పీజీఆర్‌ఎ్‌సకు 29 అర్జీలు వచ్చాయి. వచ్చిన సమస్యలే మళ్లి పునరావృతం అవుతున్నాయని, పునరావృతం కాకుండా చూడాలన్నారు. డి.సి.సతీ్‌షకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, మేనేజర్ చిన్నరాముడు, ఎంఈ మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్, డీసీపి వెంకటరమణ, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ స్థలాల్లో కాలువలు నిర్మిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యుడు పుల్లారెడ్డి ఆరోపించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. శివారు కాలనీల్లో ఇంతవరకు డ్రైనేజీ నిర్మించలేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంకటేశ్వర్లు, ఎస్.అన్వర్, కే.శ్రీనివాసులు, ఎస్.అజీజుల్లా, సి.శ్రీరాములు పాల్గొన్నారు