Share News

31 ఏళ్ల అనంతరం కలిశారు..

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:43 AM

మండలంలోని సిమెంట్‌ నగర్‌ పాణ్యం సిమెంట్‌ ఉన్నత పాఠశాల 1994-95 పదో తరగతి విద్యార్థులు 31 ఏళ్ల అనంతరం కలిశారు.

31 ఏళ్ల అనంతరం కలిశారు..
ఉపాధ్యాయులతో సిమెంట్‌ నగర్‌ పాఠశాల పూర్వ విద్యార్ధులు

1994-95 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బేతంచెర్ల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని సిమెంట్‌ నగర్‌ పాణ్యం సిమెంట్‌ ఉన్నత పాఠశాల 1994-95 పదో తరగతి విద్యార్థులు 31 ఏళ్ల అనంతరం కలిశారు. శనివారంపాఠశాలలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను, పాత మిత్రులను ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకుంటూ పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తిరిగి వెళ్లే సమయంలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలికారు. పూర్వ విద్యార్ధులు నాగేశ్వరరావు, విజయ భాస్కర్‌, వీరేష్‌, హుస్సేన్‌, మధు, వైవి వెంకటలక్ష్మీ, నిర్మల, సుభాషిణి, జగదీశ్వరి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2026 | 12:43 AM