Share News

అ'పూర్వ సమ్మేళం'

ABN , Publish Date - May 18 , 2026 | 12:33 AM

: మండలంలోని సిమెంట్‌ నగర్‌ గ్రామంలోని పాణ్యం సిమెంట్స్‌ ఉన్నత పాఠశాలలో 2000-01 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్ధులు ఆదివారం కలిశారు.

అ'పూర్వ సమ్మేళం'
నాటి ఉపాధ్యాయులతో 2000-01 పూర్వ విద్యార్ధులు

25 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు

బేతంచెర్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిమెంట్‌ నగర్‌ గ్రామంలోని పాణ్యం సిమెంట్స్‌ ఉన్నత పాఠశాలలో 2000-01 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్ధులు ఆదివారం కలిశారు. హెచ్‌ఎం ముజరత్‌ జహాన్‌ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. నాటి ఉపాధ్యాయులు గోవింద ప్రసాద్‌, హరిబాబు, నాగమణి, దేవమణి, సుధాకర్‌ శర్మ, సంపత్‌ కుమార్‌, నిర్మల కుమార్‌, రాజు, మల్లికార్జున, రఘునాథ్‌ రెడ్డిను సన్మానిచారు. పూర్వ విద్యార్ధులు మేఘవర్ధన్‌, చాంద్‌, రాముడు, నరేష్‌, ప్రసాద్‌, ప్రవీన్‌, శివకుమార్‌, చాంద్‌బాషా, కృష్ణవేణి, లక్ష్మీ, సుహాసిని, మేరి పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:33 AM