Share News

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:24 AM

గూడూరు నగర పంచా యతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశా మని అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, నగర కమిషనర్‌ రమేష్‌బాబు అన్నారు.

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నఅధికారులు

గూడూరు అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): గూడూరు నగర పంచా యతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశా మని అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, నగర కమిషనర్‌ రమేష్‌బాబు అన్నారు. గురువారం గూడూరులోని ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి స్వీక రించనున్న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లును ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియంవద, గూడూరు, సీ బెళగల్‌ తహసీ ల్దార్లు వెంకటేష్‌ నాయక్‌, వెంకటలక్ష్మి, కమిషనర్‌ రమేష్‌ బాబు పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూనగర పంచాయతీ పరిదిలో 23 వార్డులున్నాయని, వీటికి సంబంధించి ఆరు నామినేషన కేంద్రా లను ఏర్పాటుచేసి ఒక్కొక్క నామినేషన కేంద్రంలో నాలుగు వార్డుల చొప్పున అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. చైర్మన అభ్యర్థికి సంబంధించి నామినేషన స్వీకరణ కేంద్రంను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:24 AM