Share News

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:39 PM

80వ స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

పోలీసు కవాతు రిహార్సల్స్‌ పరిశీలించిన ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : 80వ స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు. ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు పరేడ్‌ కమాండర్‌గా, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబు ద్వితీయ పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఏఆర్‌, సివిల్‌ పోలీసులు, హోంగార్డులు, ఎన్‌సీసీ, స్కౌట్‌ విద్యార్థులు, పోలీసు బ్యాండ్‌ సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. కవాతు ప్రదర్శనను పరిశీలించిన ఎస్పీ పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్‌ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్ధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, అదనపు ఎస్పీ ఎస్‌ ఖాదర్‌ బాషా, ఏఆర్‌ అదనపు ఎస్పీ చిన్న క్రిష్ణ, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎ్‌సఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:39 PM