కూటమి సభకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:36 PM
నగరంలోని బాలాజీ నగర్‌లోని కర్నూలు కన్వర్షన్ హాలు (బైరెడ్డి ఫంక్షన్ హాలు)లో సోమ వారం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు సారథ్యంలోని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు ఆదివారం రాత్రికి ఏర్పాట్లు పూర్త య్యాయి.
రెండేళ్ల ప్రగతిని వివరించనున్న నాయకులు
5వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు
10.30 గంటలకు సభ ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన కూటమి నాయకులు
కర్నూలు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బాలాజీ నగర్‌లోని కర్నూలు కన్వర్షన్ హాలు (బైరెడ్డి ఫంక్షన్ హాలు)లో సోమ వారం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు సారథ్యంలోని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు ఆదివారం రాత్రికి ఏర్పాట్లు పూర్త య్యాయి. 5వేల మంది కూర్చుని సభను వీక్షించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఎంపీ బస్తిపాటి నాగరాజు సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు హాజరవుతారు. ఈ సభను దిగ్విజయం చేసేందుకు ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, రామకృష్ణ, సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన ప్రగతి, అభివృధ్ది, సంక్షేమాన్ని ప్రజలకు వివరించే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా కూటమి పార్టీలు సంయుక్తంగా విజయోత్సవ సబలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది.