సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:42 AM
పరిషత ఎన్నికల్లో గురువారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
57 పోలింగ్ కేంద్రాలు, 285 సిబ్బంది
ఎంపీటీసీ బరిలో 43 మంది అభ్యర్థులు
జడ్పీటీసీ బరిలో ముగ్గురు
ఓర్వకల్లు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పరిషత ఎన్నికల్లో గురువారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓర్వకల్లులోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నాగ అనసూయ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులతో పాటు పత్రాలను ఎన్నికల సిబ్బందికి అందజేశారు. మండలంలో 17ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జడ్పీటీసికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో మండలంలో 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తహసీల్దార్ విద్యాసాగర్, జోనల్ రూట్ అధికారులు ఓంకార్ యాదవ్, సురేంద్రనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కోడుమూరు: మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 21 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి 51 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 68 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 84 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణలో ఓటింగ్ నిర్వహించెందుకు 388 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించగా పోలింగ్ కేంద్ర సామగ్రితో మండలంలోని ఆయా గ్రామాలకు బుధవారం పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు.
సి.బెళగల్ : మండలంలో 18 గ్రామ పంచాయతీలకు 55 పోలింగ్ కేంద్రాల్లో గురువారం నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగిణి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పీవోలు, ఏపీవోలు, ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామగ్రిని అందజేశారు.
గూడూరు: మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి. కర్రెన్న తెలిపారు. బుదవారం గూడూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన సెంటర్‌లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఎంపీడీవో కృష్ణ మోహన శర్మ, ఏవో అయూబ్ ఖాన, జూనియర్ అసిస్టెంట్ రమణ ఉన్నారు.
కల్లూరు: మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 13 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. అందులో భాగంగా బుధవారం మండల పరిషత కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. కల్లూరు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఒక జడ్పీటీసీ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. మండలంలో 48 పోలింగ్ కేంద్రాల్లో 38,479 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.