సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:12 PM
నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో బుధవారం నిర్వహించే రెండేళ్ల నమ్మకం- అభివృద్ది, సంక్షేమం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.
నేడు రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం
రెండేళ్ల ప్రభుత్వ ప్రగతి అంశాలపై ప్రసంగాలు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్‌ఎండీ, కలెక్టర్ రాజకుమారి
నంద్యాల, జూన్16(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో బుధవారం నిర్వహించే రెండేళ్ల నమ్మకం- అభివృద్ది, సంక్షేమం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. సుమారు 5 వేల మంది వీక్షించేలా తగిన వసతులు ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుం జయ్ పర్యవేక్షణ లో ఏర్పాటు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్ఠ్రధాన వేదికతో పాటు వివిధ శాఖల స్టాల్స్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ఆరా తీసి దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా ఇన్‌చార్జి మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫీరోజ్, ఎమ్మెల్యేలు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, బుడ్డా రాజ శేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్తా జయ సూర్య, కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు మిగతా కూటమి నాయకులు హాజరుకానున్నారు.
రెండేళ్ల పాలనకు సంబరాలు
నంద్యాల రూరల్: కూటమి ప్రభుత్వ రెండేళ్లనకు బుధవారం జిల్లాలో సంబరాలు చేస్తున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ తెలిపారు. టెక్కె మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సభను జయప్రదం చేయాలన్నారు.