అంతా ప్రశాంతం..!
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:34 AM
ఐదేళ్ల క్రితం నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కనిపించిన పరిస్థితులకు.. ప్రస్తుత సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల వాతావరణానికి మధ్య స్పష్టమైన తేడా కనిపి స్తోంది.
ముగిసిన నామినేషన్ల పర్వం
వైసీపీ హయాంలో దౌర్జన్యం
నాడు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు
కూటమిలో ప్రజాస్వామ్యం
వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు పాలనకు ఇదే తేడా
నాటి, నేటి పరిస్థితులపై రాజకీయాల్లో వర్గాలో చర్చ
ఐదేళ్ల క్రితం నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కనిపించిన పరిస్థితులకు.. ప్రస్తుత సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల వాతావరణానికి మధ్య స్పష్టమైన తేడా కనిపి స్తోంది. ఆనాడు ప్రతిపక్ష టీడీపీ సహా ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించాయి. నేడు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం కల్పించింది. కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీ అభ్యర్థులు కలిసి నామినేషన్లు వేసి స్నేహపూర్వక వాతావరణం కల్పించారు. నాటి పరిణామాలు.. నేటి పరిస్థితులను పోల్చుతూ సీఎం చంద్రబాబు పాలన శైలికి.. గత వైసీపీ ప్రభుత్వ తీరుకు మధ్య ‘ఎంతో తేడా!’ ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగు తోంది. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆదివారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నాడు భయనక వాతావరణం ఉండగా నేడు అంతా ప్రశాంతంగా సాగింది. ఇంత ప్రశాంతంగా నామినేషన్లు ముగుస్తాయని అనుకోలేదని వైసీపీ నాయకుడు ఒకరు పేర్కొనడం కొసమెరుపు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు సహా నందికొట్కూరు, గూడూరు, బేతంచర్ల నగర పంచా యతీలకు 2021లో ఎన్నికలు జరిగాయి. నాడు పరోక్ష ఎన్నికలు (వార్డు కౌన్సిలర్లు చైర్మన్‌ను ఎన్నుకునే విధానం) కావడంతో 326వార్డులకు ఎన్నికలు జరిగాయి. 2020 మార్చి 11నుంచి 13వరకు నామినేషన్లు స్వీకరించారు. కరోనా విజృంభించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. ఏడాది తరువాత 2021 మార్చి 10న పోలింగ్ జరిగింది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఏకగ్రీవాల ముసుగులో అప్రజా స్వామ్యానికి బాటలు వేశారు. నామినేషన్లు, విత్ డ్రాలు, ప్రచారం, పోలింగ్.. ఇలా అన్ని దశల్లోనూ దౌర్జన్యాలు, అక్రమాలకు పెద్దపీట వేశారు.
బుజ్జగింపులు.. బెదిరింపు.. దౌర్జన్యాలు
నాడు అధికార వైసీపీ బుజ్జగింపులు.. బెదిరింపులు.. దౌర్జన్యాలు.. అస్త్రాలుగా పట్టణ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష పార్టీలైనా, స్వతంత్ర అభ్యర్థులైనా నామినేషన్లు వేస్తారని తెలియగానే మీరు నామినేషన్ వేసి ఎలాగూ గెలవలేరు.. మీకు ఏవైనా పనులుంటే చేసి పెడుతాం! పోటీ చేయవద్దంటూ మొదట బుజ్జగించారు. అం దుకు ససేమిరా అంటే పోలీసుల ద్వారా భయపెట్టారు. అప్పటికి ఒప్పుకోకపోతే దౌర్జన్యా లకు దిగి నామినేషన్లు పత్రాలు చింపివేయడం, బలవంతంగా విత్‌డ్రా చేయించిన సం ఘటనలు లేకపోలేదు. పోలింగ్ రోజు కూడా సైక్లింగ్‌కు పాల్పడి దొంగ ఓట్లు వేసుకున్నార నే ఆరోపణులున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడితే నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలనే బహిష్కరించారంటే నాటి ఎన్నికల్లో అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయో ఇట్టే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 78కిపైగా వార్డులు, మూడు మున్సిపాలిటీలు ఏకగ్రీవం చేసుకున్నారు.
ఏఒక్క చిన్న ఘటన జరగకుండా..
ఉమ్మడి జిల్లాలో కర్నూలు మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మ కూరు మున్సిపాలిటీలు సహా నందికొట్కూరు, గూడూరు, బేతంచర్ల నగర పంచాయతీల చైర్మన్లు, 399వార్డులకు ఎన్నికల ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదివారం నామి నేషన్ల స్వీకరణ జరిగింది. రెండు జిల్లాలో ఎక్కడా ఏచిన్న సంఘటన జరగకుండా నామి నేషన్లు పర్వం సజావుగా ముగిసింది. అమ్మయ్యా.. ఓ పనైపోయింది! ఇంతా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం నాసర్వీ్సలో మునుపెన్నడూ చూడలేదని ఓసీఐ పేర్కొ నడం కొసమెరుపు. ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం నగర, పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలులో జోహరాపురం, వెంకటరమణ కాలనీల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామి నేషన్లు వేయకుండా భయాందోళనలు సృష్టించారు. కల్లూరు అర్బన్‌లోని మూడు వార్డుల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు విత్‌డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకు న్నారు.
ఆదోనిలో నాటి వైసీపీ ముఖ్య నాయకులు పోలీసుల ద్వారా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను భయపెట్టించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఓవార్డులో వైసీపీ అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నామినేషన్లను చింపివేశారు. 9వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. ఎమ్మి గనూరులో విత్‌డ్రా టైం అయిపోయిన తరువాత ఓ వార్డు టీడీపీ అభ్యర్థిని బలవంతంగా తీసుకొచ్చి విత్‌డ్రా చేయించారు.
డోన్ మున్సిపాలిటీలో ఏకగ్రీవాల ముసుగులో నాటి వైసీపీ నాయకులు దౌర్జన్య కాండ సాగించారు. పోలీసులతో భయపెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా 25 వార్డులు ఏకగ్రీవం చేసుకొని మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. ఏడు వార్డులకు ఎన్నికలు జరి గితే పోలింగ్ రోజు అక్రమాలకు అడ్డేలేదని నాటి చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసు కుంటున్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీలో 24వార్డులుంటే పోలీసులతో భయపెట్టి 15 వార్డుల్లో అభ్యర్థులు పోటీకి రాకుండా అడ్డుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన 9 వార్డుల్లో కూడా పోలింగ్ రోజు దౌర్జన్యాలకు దిగి సైక్లింగ్‌కు పాల్పడ్డారు.
నందికొట్కూరులో నాటి వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఏడు వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో నామినేషన్ల రోజున ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. టీడీపీ అభ్యర్థి నామినేషన్ చింపేయడంతో ఘర్షణ జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్టపాలైందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
నంద్యాల మున్సిపాలిటీలో కూడా నాటి అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు దిగి, ప్రత్యర్థులను భయపెట్టి 18వార్డుల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఆ వార్డుల ను ఏకగ్రీవం చేసుకున్నారు. పోలింగ్ రోజు కూడా వైసీపీ మార్క్ చూపించారు.