ప్రతి ఓటు విలువైనదే
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:03 AM
: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రతి ఓటు విలువైనదని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు.
కర్నూలు ఆర్‌వో, కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రతి ఓటు విలువైనదని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయంలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్క ఓటుతోనే అభ్యర్థులు గెలుపొందిన సంఘటనలున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మతం, కులం, భాష, ప్రలోభాలకు లోనుకాకుండ స్వేచ్చాయుతంగా నైతికంగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. ఈ ఏడాది ‘నా భారత్, నా ఓటు ’ అనే నినాదంతో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని, ప్రతి ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేనేజర్ చిన్నరాముడు, డిప్యూటి తహశీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్‌భాష, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం
ఓర్వకల్లు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధమని డిప్యూటీ తహసీల్దార్ సతీష్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.