ప్రతి అర్జీని పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:35 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్ డా.ఎ. సిరి అదికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్ డా.ఎ. సిరి అదికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్, జేసీ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో నమోదవుతున్న రీఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులను పూర్తిగా తగ్గించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.