Share News

ప్రతి అధికారి చురుగ్గా పనిచేయండి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:33 PM

ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రతి అధికారి చురుగ్గా పని చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశిం చారు.

ప్రతి అధికారి చురుగ్గా పనిచేయండి
దరఖాస్తులు స్వీకరిస్తున్నకలెక్టర్‌ ఏ.సిరి

రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి

కలెక్టర్‌ ఏ.సిరి

తుగ్గలి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రతి అధికారి చురుగ్గా పని చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశిం చారు. శుక్రవారం తుగ్గలిలో ‘ఒక నెల, ఒక గ్రామం’లో నాలుగో పర్యటనలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూసమస్యలపై 41 దర ఖా స్తులు వచ్చాయి. ఆమె మాట్లాడుతూ గత మూడు పర్యటనలో దాదాపు 300 అర్జీలొచ్చాయని, అందులో 105దరఖాస్తులకు పరి ష్కారం చేశామ న్నారు. రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రీసర్వేలో విస్తీర్ణ వ్య త్యాసాలు, 22ఏ సంబంధిత అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని, అధికారులెవరూ నిర్లక్ష్యంగా వహించొద్దని అన్నారు. రైతుకు నోటీసు ఇచ్చే రీసర్వేకు వెళ్లాలన్నారు. 1952కు ముందు ప్రభుత్వ భూములు పొందిన రైతులకు వారి భూములకు సర్వహక్కులు అంది స్తామన్నారు. జేసీ నూరు ల్‌ ఖమర్‌, ఆర్డీవో ఓబులేసు, ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, డీపీవో భాస్కర్‌, తహసీల్దార్‌ రవి పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:33 PM