Share News

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:03 AM

: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఆళ్లగడ్డలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆళ్లగడలో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

ఆళ్లగడ్డ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఆళ్లగడ్డలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అమలు చెయ్యడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. తక్షణ మే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయ్యక పోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బార్‌ అసోషియేషన్‌ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జనార్దన్‌, వెంకటరమణ, మురళీధర్‌బాబు, తిమ్మయ్య, మాదంరవి, జాయింట్‌ సెక్రటరీ షాహినా బేగం, ట్రెజరర్‌ శ్రావణి, బాబా ఫకురుద్దీన్‌, తొమ్మండ్రు వినోద్‌ కుమార్‌, చాణక్య తదితరులు పాల్గొన్నారు.

కోవెలకుంట్ల: కర్నూలులో పర్మనెంట్‌ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సీనియర్‌ న్యాయవాదులు వాసగిరి సాయి క్రిష్ణమూర్తి, ప్రేమనాధ్‌, మధుసూదన్‌ రెడ్డి, బాలమురళి కృష్ణ, మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టుబెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు న్యాయసేవలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, కక్షిదారులకు ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిరుపాలు, వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌, ట్రెజరర్‌ నాగశేషు, సీనియర్‌ న్యాయవాదులు తిరుపతయ్య, శ్రీనివాసులు, ఖాసీం, ఓబులేసు, జూనియర్‌ న్యాయవాదులు సుధాకర్‌, కంబగిరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:03 AM