Share News

అసంఘటిత కార్మికులకు వరం ఈ-శ్రమ్‌ కార్డు

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:29 PM

జిల్లాలో ఉన్న అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్‌ కార్డు వరం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.

అసంఘటిత కార్మికులకు వరం ఈ-శ్రమ్‌ కార్డు
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్‌ కార్డు వరం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. శనివారం స్థానిక వెంకటరమణ కాలనీలోని రైతు మార్కెట్‌లో జరిగిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని, వాటిలో ఈశ్రమ్‌ కార్డు కూడా ఒకటి అన్నారు. ఈకార్డు పొందితే బీమా, ఉచిత వైద్యంతో పాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కెట్‌లోని కార్మికులకు ఈశ్రమ్‌ కార్డుల కోసం ఈశ్రమ్‌ పోర్టల్‌లో ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు. 40 మంది కార్మికులకు ఈశ్రమ్‌ కార్డులు 5 మందికి పెన్షన్‌ కార్డులు అందించామ న్నారు. కంటి వైద్యశిబిరంలో డా.జయరాం, డా.రంగనాథ్‌, డా.ప్రభాకర్‌ ఆధ్వర్యంలో 60 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రైతు మార్కె ట్‌ మేనేజర్‌ జయమ్మ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సాంబశివరావు, ఆర్‌.కేశన్న, లేబర్‌ ఆఫీసర్‌ కే.హేమాద్రి, సమీర్‌, డా.రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 11:29 PM