Share News

క్షయ నిర్మూలన అందరి బాధ్యత: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:52 PM

క్షయ నిర్మూలన అందరి బాధ్యత అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

క్షయ నిర్మూలన అందరి బాధ్యత: ఎమ్మెల్యే
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): క్షయ నిర్మూలన అందరి బాధ్యత అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఎమ్మెల్యే మంగళవారం తన నివాసంలో గార్గేయపురం పీహెచసీ పరిధిలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్క రించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్‌ భారత అభియాన కార్యక్రమం ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గిపోవడం, ఆరవై ఏళ్లు పైబడిన వారు పొగతాగడం, మద్యం సేవించడం వంటి వారు టీబీ గళ్ల పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచసీ వైద్యులు డాక్టర్‌ హేమలత, సూపర్‌వైజర్‌ నిషిత, సీహెచఓ నమ్రత, ఆరోగ్య కార్యకర్త శైనీ, కళావతి, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:52 PM