Share News

అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:11 PM

నగరంలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ, నిధుల లభ్యతను బట్టిపనులు చేపడతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

రూ. 3.64 కోట్ల పనులకు శంకుస్థాపన

స్మార్ట్‌ సిటీకి ప్రత్యేక ప్రణాళిక

కేఎంసీ కమిషనర్‌తో కలిసి శంకుస్థాపన చేసినమంత్రి టీజీ భరత్‌

కర్నూలు న్యూసిటి,సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నగరంలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ, నిధుల లభ్యతను బట్టిపనులు చేపడతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్‌ క్యాప్‌ నిధులతో చేపట్టనున్న రూ. 3.64 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేశ్‌తో కలిసి మంత్రి టీజీ భరత్‌ శంకుస్థాపన చేశారు. పాతబస్టాండ్‌లో శ్రీనివాస్‌ క్లాత్‌ మార్కెట్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు బీటీ రోడ్డు, సుంకేసుల రోడ్డు నుంచి అమీర్‌ హైదర్‌కాలనీ వరకు రహదారి నిర్మాణం, రహదారి విస్తరణతో పాటు కుడా కార్యాలయం నుండి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి సర్కిల్‌ వరకు రోడ్డు విస్తరణ, గ్రీనరీ అభివృద్ధి పనులు రూ. 1.66 కోట్లతో చేపట్టనున్నారు. వంశీకృష్ణ ఆసుపత్రి జంక్షన్‌ నుంచి విశాల్‌ మార్ట్‌ వరకు గ్రీనరీ అభివృద్ధి పనులు రూ. 1.98 కోట్లతో చేపట్టనున్నామని తెలిపారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఏఈ ఖాసీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:11 PM