Share News

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:15 AM

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్క నాటుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించు కుని నగరంలోని 21వ వార్డులోని శాంతినగర్‌లో నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలసి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తూ సంరక్షణ పత్రాలపై సంతకాలు చేయించారు. ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందిం చడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్‌ ఓబులేసు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ క్రిష్ణలత, హర్టికల్చర్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి, శానిటేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు కల్చరల్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుక్రవారం వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ, లయన్స్‌ క్లబ్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ సోషల్‌ జస్టిస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, నైస్‌ యూత్‌ ఫర్‌ కల్చర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జిల్లా అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జడ్పీలో నిర్వ హించిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణను తెలియ జేసే పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, కార్యాచర ణను వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, కమి షనర్‌ చల్లా ఓబులేసు, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజనల్‌ అధి కారి పీవీ కిషోర్‌కుమార్‌ రెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, సభ్యులు మురారి శంకరప్ప, కేడీజే బాబు, దామోదర్‌, భారత్‌ వికాస్‌ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన్‌: స్థానిక ఏ.క్యాంపులోని మైఫర్‌ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.ఎం.రాజ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డా.కాసర్ల సురేష్‌, భాస్కర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని టీడీపీ మండల అధ్యక్షుడు జె సురేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పెంచికలపాడు గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద ర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సురేష్‌ మాట్లా డుతూ ప్రతి ఏడాది జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపు కుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ మోహన్‌ శర్మ, ఎంఈవో సునీలమ్మ, రాష్ట్ర కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకట్రా ముడు, సుంకులాపరమేశ్వరి ఆలయ కమిటీ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ రెడ్డి, నాగేష్‌, కర్ణం చిన్న గిడ్డయ్య, ఎంపీటీసీ మద్దిలేటి, తిప్పన్న, ఫీల్డ్‌ అసిస్టెం ట్‌ పోతురాజు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిం చాలని ఎంపీడీవో నాగ అనసూయ అన్నారు. శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యం లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హుశేనాపురం గ్రామంలోని పీహెచ్‌సీ, పాఠశా లలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో ఎంపీడీవో నాగ అనసూయ, డా.రేఖ, నంద్యాల పార్లమెంటు ట్రెజరర్‌ మహబూబ్‌ బాషా, కాల్వబుగ్గ చైర్మన్‌ కాటినేని నారాయణ, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు జీకే సుధాకర్‌ మొక్కలు నాటారు. ఓర్వక ల్లులో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్య క్షుడు గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, కన్నమడకల గ్రామంలో సొసైటీ అధ్యక్షులు సుధాకర్‌రావు, అధికారులు మొక్కలు నాటారు.

Updated Date - Jun 06 , 2026 | 12:15 AM