పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:33 PM
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సెల్వం అన్నారు.
కర్నూలు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సెల్వం
కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన అధికారులు
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సెల్వం అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సెల్వం మాట్లాడుతూ ప్రతిఒక్క పౌరుడు తమవంతు బాధ్యతగా పచ్చదనం పెంపునకు కంకణబద్ధులు కావాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయ ణమ్మ మాట్లాడుతూ ప్రజలు మొక్కలు నాటడం, జల సంరక్షణ, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించటం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిం చాలన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నగర వీధుల్లో హరిత ప్రదర్శన, కళాజాత బృందాలచే కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాతావరణ మార్పు, హరిత వనాల విస్తరణ, పచ్చదనం పెంపుపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, ఏపీ కాలుష్య నియ్రంతణ మండలి సీనియర్ పర్యావరణ ఇంజనీర్ శంకర్‌రావు, పీవీ కిషోర్‌రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో స్వామి వివేకానంద, ఎఫ్‌ఆర్వోలు ప్రియాంక, తేజస్విని, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.