Share News

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:30 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్దుర్తిలోని డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో నెట్‌ జీరో హెల్దీ క్యాంప్‌సలో భాగంగా అల్ర్టా హైడెన్సీటీ ప్లాంటింగ్‌ కార్యక్రమంలో పాల్గొని మామిడి, నేరేడు మొక్కలను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి కలెక్టర్‌ నాటారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మొక్క నాటుతున్న కలెక్టర్‌ సిరి, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

కలెక్టర్‌ ఏ.సిరి

మొక్కలు నాటి సర రక్షించండి..ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

వెల్దుర్తి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్దుర్తిలోని డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో నెట్‌ జీరో హెల్దీ క్యాంప్‌సలో భాగంగా అల్ర్టా హైడెన్సీటీ ప్లాంటింగ్‌ కార్యక్రమంలో పాల్గొని మామిడి, నేరేడు మొక్కలను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి కలెక్టర్‌ నాటారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా విద్యాసంస్థలను నెట్‌ జీరో హెల్దీ క్యాంప్‌సలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే కేఈ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ కృషితోనే డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల మంజూరైందని, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హయాంలో భవన నిర్మాణం పూర్తయిందన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ నరసింహారెడ్డి, జడ్పీ సీఈవో రమణరెడ్డి, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, జిల్లా నాయకుడు సుబ్బారాయుడు, సింగిల్‌ విండో చైర్మన్‌ రమాకాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ లక్ష్మీప్రసూన, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బాబురావు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:30 PM