Share News

ఊర్లకు ఊర్లు ఖాళీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:16 PM

ఎల్‌నినో కారణంగా మండలంలో సరైనా వర్షపాతం నమో దు కాకపోవడంతో ఉపాధి కోసం రైతులు, వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస వెళ్తుండటంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్నాయి.

ఊర్లకు ఊర్లు ఖాళీ
ఆస్పరిలో వలస వెళ్తూ తమ వారికి టాటా చెబుతున్న కూలీలు

ఆస్పరి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా మండలంలో సరైనా వర్షపాతం నమో దు కాకపోవడంతో ఉపాధి కోసం రైతులు, వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస వెళ్తుండటంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్నాయి. మండలంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉండడంతో వర్షాధార పంటలపైనే రైతులు ఆధారపడేవారు. ప్రతియేటా జనవరిలో వలస వెళ్లే వ్యవసాయ కూలీలు, ప్రజలు ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలోనే వెళ్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ప్రాథమిక దశలోనే వాడుముఖం పట్టి ఎండిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడులకు దిగుబడులు రాక ఆయా గ్రామాల రైతులు తమ అప్పులను తీర్చుకునేందుకు వలసబాట పట్టారు.

Updated Date - Oct 03 , 2026 | 11:16 PM