Share News

ఆపరేషన్ల వివరాలు ఆనలైనలో నమోదు చేయండి

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:02 AM

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించిన కంటి ఆపరేషన్లకు సంబంధించిన రోగుల వివరాలు జాతీయ అంధత్వ దృష్టి లోప నివారణ వెబ్‌పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచవో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ ఆదేశించారు.

ఆపరేషన్ల వివరాలు ఆనలైనలో నమోదు చేయండి
మాట్లాడుతున్న డీఎంహెచవో కామేశ్వర ప్రసాద్‌

డీఎంహెచవో కామేశ్వర ప్రసాద్‌

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించిన కంటి ఆపరేషన్లకు సంబంధించిన రోగుల వివరాలు జాతీయ అంధత్వ దృష్టి లోప నివారణ వెబ్‌పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచవో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో కంటి ఆపరేషన్లను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సూప రింటెండెంట్లు కంటి వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఆసుపత్రులు తప్పనిసరిగ్గా ఎనపీసీబీ, వీఐ పోర్టల్‌లో రోగుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సమావేశంలో డీసీహెచఎస్‌ జఫ్రుల్లా, జిల్లా అంధత్వ నివారణ సంస్థ కోఆర్డినేటర్‌ డా.హిమ బిందు, ఎమ్మిగ నూరు, ఆదోని ఆసుపత్రి వర్గాలు పాల్గొన్నారు.

నిర్జీవ జననాలపై సమీక్ష: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం డీఎంహెచవో కామేశ్వర ప్రసాద్‌ అధ్యక్షతన నిర్జీవ జననాలపై సమీక్ష నిర్వహించారు. కర్నూలు జీజీహెచ గైనిక్‌ హెచవోడీ డా.సావిత్రి, పీడీయాట్రిషన డా. ప్రకాష్‌, అనస్థీషియా ప్రొఫె సర్‌ డా. మురళీప్రభాకర్‌ సమీక్ష జరిపారు. జనవరి నెలలో జరిగిన నిర్జీవ జననంపై పూర్తి స్థాయి విచారణ జరిపారు. కార్యక్రమంలో డీసీహె చఎస్‌ డా.జఫ్రుల్లా, 104 నోడల్‌ ఆఫీసర్లు, బాబా ఫకృద్దీన, సీహెచవో అన్నపూర్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:02 AM