Share News

కచ్చితంగా నమోదు చేయండి

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:15 PM

జనగణనలో ప్రతి పౌరుడి వివరాలు కచ్చితంగా జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు.

కచ్చితంగా నమోదు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జనగణనలో ప్రతి పౌరుడి వివరాలు కచ్చితంగా జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. శుక్రవారం జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో భారత జనగణన 2027 తొలిదశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబిత, గృహ జనగణన కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలుకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. జనగణన దేశ అభివృద్దికి పునాది వంటిదన్నారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. డీఆర్వో వెంకట నారాయణమ్మ, జనగణన అధికారి జాయింట్‌ డైరెక్టర్‌ జగన్నాథ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ దివాకర్‌ బరీహా, మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌, జెడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఆర్డీవోలు సందీప్‌కుమార్‌, కొండయ్య, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:15 PM