Share News

ఎలక్ట్రికల్‌ పరికరాలు వినియోగించేలా చూడాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:31 PM

జిల్లాలో గ్యాస్‌ వినియోగం తగ్గించి ఇండక్షన్‌ స్టవ్‌, సోలార్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ లాంటి ఎలక్ట్రికల్‌ పరికరాలు ప్రజలు వినియోగించేలా చూడాలని కలెక్టర్‌ ఎ.సిరి అధికారులను ఆదేశించారు.

ఎలక్ట్రికల్‌ పరికరాలు వినియోగించేలా చూడాలి: కలెక్టర్‌
కలెక్టర్‌ ఎ.సిరి

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్యాస్‌ వినియోగం తగ్గించి ఇండక్షన్‌ స్టవ్‌, సోలార్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ లాంటి ఎలక్ట్రికల్‌ పరికరాలు ప్రజలు వినియోగించేలా చూడాలని కలెక్టర్‌ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ అంశంపై కలెక్టర్‌ డివిజన్‌, మండల స్థాయి అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్యాస్‌ వాడకాన్ని తగ్గించి సోలార్‌ కుక్కర్లు, ఎలక్రిక్టక్‌ కుక్కర్లు, ఇండక్షన్‌ స్టౌలు లాంటి పరికరాలను పంపిణీ చేసే ప్రణాళికను సిద్ధం చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌కు కలెక్టర్‌ సూచించారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ నీరజ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డీపీవో భాస్కర్‌, డీసీఎస్‌వో రాజా రఘువీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:31 PM