Share News

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించండి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:50 PM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి బీఎల్వోలను ఆదేశించారు.

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ పక్కన డీఆర్వో తదితరులు

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి బీఎల్వోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమ శిక్షణలో కబీఎల్వోలకు సమగ్ర మార్గదర్శకాలు అందించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎన్యుమరేషన్‌ ఫారాల భర్తీ, క్షేత్రస్థాయి ధ్రువీ కరణ విధానాలు, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన నిబంధన లపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్ర మాన్ని పారదర్శకంగా నిర్వహిం చాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కచ్చిత మైన సమాచా రంతో ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. జులై 21న డ్రాఫ్ట్‌ ఓ టరు జాబితా ప్రచురిస్తామన్నారు. సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందన్నారు. డీఆర్వో రామునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:50 PM