Share News

నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించండి

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:48 PM

నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించండి

నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించండి
కప్పట్రాళ్లలో నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

అధికారులతో కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సిరి ఆదేశించారు. ఆదివారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కేంద్రాల్లో 5 ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్‌ దాఖలు చేసి ఆభ్యర్ధితో పాటు మరో 2 వ్యక్తులకు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి గదిలోకి అనుమతి ఇవ్వాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో వాహనాల నియంత్రణ నిబంధనలు అమలు చేయాలన్నారు. నామినేషన్లకు సంబంధించిన వీడియో ఫుటేజీ, రికార్డులను కనీసం 60 రోజుల పాటు భద్రపరచాలన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరుకు సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించాలన్నారు.

అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించొద్దు

దేవనకొండ: సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్‌ వేసేందుకు వచ్చే అ భ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సిరి సూచించారు. మండలంలోని కప్పట్రాళ్ల, కుంకనూరు గ్రామాలల్లో ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్‌ కేంద్రాలలో అభ్యర్థులకు ఇబ్బందులు తల్లెత్తకుండా హెల్ప్‌ డెస్క్‌లు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, క్లస్టర్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. నామినేషన్లు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చుడాలని అధికారులను ఆదేశించారు. పత్తికొండ ఆర్డీవో చిన్న ఓబులేశ్‌, తహసీల్దార్‌ వైకే రామేశ్వరరెడ్డి, ఎంపీడీవో జ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో గోపాల్‌ ఉన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:48 PM