ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయండి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:28 PM
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారులకు సత్వరమే న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశిం చారు.
ఎస్పీ సునీల్ షెరాన్
మహానంది, జూలై 3 (ఆంరఽధజ్యోతి): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారులకు సత్వరమే న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశిం చారు. శుక్రవారం మహానంది పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల గురించి ఆరా తీశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బం దిని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను క్షేత్రస్ధాయిలో అమలు చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధి తులతో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.జావళి, రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.