ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చూడాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:23 PM
నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు.
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు. పట్టణంలోని 6, 15, 27 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, ర్యాంపులు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.