ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
ABN , Publish Date - May 16 , 2026 | 11:18 PM
కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
సంజామల, మే 16 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంజామలలో జరిగిన ‘స్వ ర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లుతుండగా ఎం ఈవో వెంకటరమణ రెడ్డి, ఇన్‌చార్జి హెచ్‌ఎం షబ్బీర్ హుస్సేన్, పీడీ బాషా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రవేశాల కోసం విద్యార్థులతో గ్రామంలోకి వస్తూ మం త్రికి ఎదురుపడ్డారు. 10వ తరగతి పరీక్షల్లో పాఠశాలకు చెందిన నాగభార్గవి 582 మార్కులతో మండల టాపర్‌గా, ద్వితీయ, తృతీయ, నాల్గవ స్థానంలో నిలిచిన విద్యార్థుల ఫొటోలతో కూడిన ప్లకార్డులను చేతబూనుకుని ప్రచారంలో పాల్గొనడంతో మంత్రి వారితో ముచ్ఛటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజన పథకం, తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.