నిధుల దుర్వినియోగంపై విచారణ
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:16 AM
జిల్లా వైద్య ఆరోగ్య పరిపాలనకు సంబంధించి డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు రాష్ట్ర కమిుషనర్ నుంచి విచారణ కోసం కడప డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హైమాదేవి గురువారం నంద్యాల డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. వ్యక్తిగత పేర్లతో నిధులు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నంద్యాల హాస్పిటల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్య పరిపాలనకు సంబంధించి డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు రాష్ట్ర కమిుషనర్ నుంచి విచారణ కోసం కడప డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హైమాదేవి గురువారం నంద్యాల డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. వ్యక్తిగత పేర్లతో నిధులు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యాలయాల నిధులు సిబ్బంది వ్యక్తిగత ఖాతాల ద్వారా రూ.లక్షలు డ్రా చేశారు. పీఎం మోదీ పర్యటనలో భాగంగా ఏర్పాట్ల కోసం డీసీహెచ్‌ఎస్ నిధులు డ్రా చేయడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. డీసీహెచ్‌ఎస్ కార్యాలయం నుంచి రూ.58,083 భోజన వసతి కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కార్యాలయ ఖాతాలో జమ ఖర్చులపై అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు డీసీహెచ్‌ఎస్ కార్యాలయ భవన పున:నిర్మాణం కోసం దాదాపు రూ.4లక్షలు ఎలాంటి టెండర్ లేకుండా నిధులు వినియోగించినట్లు సమాచారం. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపడితే అసలు విషయాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని డాక్టర్ హైమాదేవి తెలిపారు. సమగ్ర విచారణ చేసి కమిషనర్‌కు నివేదిక పంపుతామన్నారు.