Share News

పోలీసు శాఖ ప్రతిష్టను పెంచండి

ABN , Publish Date - May 20 , 2026 | 12:04 AM

ప్రజల్లో మమేకమై.. క్రమ శిక్షణగా విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ తెలిపారు.

పోలీసు శాఖ ప్రతిష్టను పెంచండి
ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుళ్లు

ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో మమేకమై.. క్రమ శిక్షణగా విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏపీఎస్‌పీ నుంచి ఏఆర్‌కు కన్వెర్షన అయిన కానిస్టే బుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు ఎస్పీ వారికి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ వివిధ వీఐపీ, ఉత్సవా లు, బందోబస్తులో ఏఆర్‌ విభాగం పోలీసులు ప్రజలతో ప్రత్యక్షంగా మమేక మయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఏఆర్‌కు కన్వర్షన అయిన వారందరూ 2003 బ్యాచకు చెందిన వారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం 12మందిని కేటాయించగా.. అందులో కర్నూలు జిల్లాకు 9 మందిని కేటాయించగా.. ఈ తొమ్మిది మంది కర్నూలు ఏపీఎస్‌పీ రెండో బెటాలియన నుంచి కర్నూలు ఏఆర్‌కు కన్వర్షన అయ్యారు. నంద్యాల జిల్లాకు ముగ్గురిని కేటాయించారు.

Updated Date - May 20 , 2026 | 12:04 AM