Share News

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:34 PM

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు.

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

జేసీ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎ స్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించిన జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల సివిల్‌ రైట్స్‌డే నిర్వహించే విదంగా చర్యలు తీసు కోవాలని కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీవోలను ఆదేశించారు. చాలా రోజు ల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన ఇన్వెస్టిగేషన్‌ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్‌ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సం దీప్‌ కుమార్‌, పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధి కారిక అదికారి బి.రాధిక, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:34 PM